ఆస్ట్రేలియా-భారత్ తొలి వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా అంపైర్లు మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆట నిలిపివేసే సమయానికి టీమిండియా 8.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ (8), గిల్ (10)తో పాటు కోహ్లీ(0) తక్కువ పరుగులకే ఔటయ్యారు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ (2), అక్షర్ పటేల్ (0) క్రీజులో ఉన్నారు.