TG: హైదరాబాద్‌లో బీసీ సంఘాల నేతల అరెస్టు కలకలం రేపింది. నిన్న జరిగిన బీసీ బంద్‌లో దాడులు చేశారనే ఆరోపణల మేరకు, కాచిగూడ పోలీసులు 9 మంది బీసీ నేతలను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తీవ్రంగా ఖండించారు. బీసీల న్యాయమైన డిమాండ్ల కోసం జరిగిన నిరసనపై అక్రమ కేసులు బనాయించడాన్ని ఆయన తప్పుబట్టారు.