KKD: ప్రత్తిపాడు మండలం ధర్మవరం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బైకు లారీని వెనుక వైపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీపావళి పండుగ నేపథ్యంలో విజయవాడ నుంచి ఇచ్చాపురం వెళ్తున్న వసంత్ కుమార్ సంధ్య దంపతులు ఆగి ఉన్న ఒక వ్యాను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో వసంత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.