NTR: తిరువూరు మండలం లక్ష్మీపురంలో అనారోగ్య కారణాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన విజయ(32) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమివ్వగా వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.