ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాకు మొదట్లోనే బిగ్ షాక్ తగిలింది. సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరగా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 8 బంతులు ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. ‘రో-కో’ ద్వయం ఇద్దరూ నిరాశపరచడంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.