NRML: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్కేప్ గేట్ల ద్వారా వరద నీరు గోదావరి నదిలోకి విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ అధికారులు ఆదివారం ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 6654 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 6654 క్యూసెక్కులు ఉందని వారు తెలిపారు. కావున వరద నీరు విడుదల చేయడం జరిగిందని మత్స్యకారులు, ప్రజలు నదిలోకి దిగకుండా అప్రమత్తంగా ఉండాలని వారు విజ్ఞప్తి చేశారు.