AP: అల్లూరి జిల్లా అరకులోయలో పెను ప్రమాదం తప్పింది. ఓ పెద్ద బండరాయి కేకే లైన్లో పట్టాలపై జారిపడింది. టైడా, చిమిడిపల్లి రైల్వే స్టేషన్ మధ్య ఈ ఘటన జరిగింది. దీంతో గూడ్స్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖలో అరకు కిరండోల్ పాసింజర్ రైలు నిలిచిపోయింది. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.