ప్రకాశం: జిల్లా హనుమంతునిపాడు వెలిగొండ ప్రాంతాలలో చిరుతపులి సంచారంపై పశువుల కాపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కనిపించకుండా పోయిన పశువులను చిరుత పులి తిన్నట్లు తెలుస్తోంది. ఆదివారం నారాయణ పల్లి సమీపంలో ఓ గేదెను చిరుత చంపి తిన్న విషయాన్ని రైతు బాల గురవయ్య గమనించాడు. ఈ విషయం అటవీ శాఖ అధికారులకు తెలియడంతో వారు చిరుత సంచారంపై దృష్టి సారించారు.