ATP: ఆత్మకూరు మండలం వైకొత్తపల్లికి గ్రామానికి చెందిన టీడీపీ ఎస్టీ సెల్ జిల్లా నాయకుడు గుజ్జల వెంకటేష్ గుండెపోటుతో మరణించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ భౌతిక కాయంపై పార్టీ జెండా ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. వెంకటేష్ మృతి బాధాకరమని ఎమ్మెల్యే దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.