BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వేదాంతపురంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు నాసిరకంగా ఉండటంతో ఇంటి యజమాని ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పనులు చేయడాన్ని నిరసిస్తూ తాను స్వయంగా ఇళ్లు కూల్చివేతకు పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.