అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూయార్క్, వాషింగ్టన్, షికాగో, లాస్ఏంజెల్స్ సహా 50 నగరాల్లో నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి.. వలసల నియంత్రణ చర్యలు, యూనివర్సిటీలకు నిధులు తగ్గించడం ఇలాంటి అంశాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.