అమెరికా మహిళ టేలర్ హంఫ్రే (37) వృత్తి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమె పిల్లలకు పేర్లు పెట్టే కన్సల్టెంట్గా పనిచేస్తూ, ఒక్క పేరుకు దాదాపు రూ.27 లక్షలు వసూలు చేస్తుంది. పేరు పెట్టడానికి వంశ చరిత్ర, అభిరుచులను తెలుసుకుంటుంది. పదేళ్లలో ఆమె సుమారు 500 మంది పిల్లలకు నామకరణం చేసింది. టేలర్ పెట్టే పేర్లను తెలుసుకోడానికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా ఎక్కువే.