జూ.ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ‘దేవర’ మూవీకి సీక్వెల్ రాబోతుంది. డిసెంబర్లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే ఈ సినిమా కథలో చాలా మార్పులు చేశారట. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ‘దేవర’ మంచి హిట్ కావడంతో.. ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.