HYD: ఐటీ మంత్రి పేషీ పేరుతో ఐటీ ప్రాజెక్టు మంజూరు చేస్తామని నమ్మించి, మియాపూర్‌కు చెందిన ఓ ఇంజినీర్‌ను రూ.1.77 కోట్లు మోసం చేశారు. నిందితులు సచివాలయాన్ని అడ్డాగా చేసుకుని, మంత్రి ఓఎస్డీ లెటర్హెడ్లు, నకిలీ పత్రాలు చూపించి బాధితుడిని మోసగించారు. బాధితుడి ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఈ మోసం కేసు విచారణను సీసీఎస్‌కు బదిలీ చేశారు.