AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎల్లుండి మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. సముద్రంలో ఉన్నవారు ఎల్లుండిలోగా తీరానికి తిరిగిరావాలని హెచ్చరించారు. అత్యవసరమైతే మత్స్యశాఖ లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు.