TG: సరిహద్దుల్లోని అంతర్రాష్ట్ర చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కామారెడ్డి(సలాబత్పూర్). సంగారెడ్డి(చిరాగ్పల్లి), భద్రాద్రి(అశ్వరావుపేట) జిల్లాల చెక్ పోస్టుల్లో అర్థరాత్రి నుంచి సోదాలు జరిగాయి. ప్రైవేట్ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు నేపథ్యంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో అధికారులు నగదును స్వాధీనం చేసుకున్నారు.