MHBD: తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన పబ్బాల రాము గౌడ్ కుమారుడు పబ్బాల అయాన్ ఆదివారం వీధి కుక్క దాడిలో గాయపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన తొర్రూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వీధి కుక్కను గ్రామస్తులు చంపేశారు. గ్రామంలో వీధి కుక్కలను నియంత్రించాలని గ్రామస్తులు కోరుతున్నారు.