HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం లైసెన్స్ పొందిన ఆయుధాలను వాటి యజమానులు సమీప పోలీస్ స్టేషన్లలో అప్పగిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని 8 PSల పరిధిలో ఉన్న మొత్తం 234 లైసెన్స్డ్ తుపాకులను డిపాజిట్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పటికే 80 శాతం ఆయుధాలు డిపాజిట్ చేశారని పోలీసులు తెలిపారు.