NZB: నవీపేట్ మండలంలోని ఫకీరాబాద్ గ్రామంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఆదివారం ఎస్సై తిరుపతి తెలిపారు. పక్కా సమాచారంతో దాడి చేసి వారిని పట్టుకున్నామని పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.32,340 నగదుతో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు.