GNTR: తెనాలికి 6KM దూరంలో ఉన్న నంది వెలుగుకి గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. ఇక్కడి కనకదుర్గమ్మ ఆలయం చోళ రాజుల కాలం నాటిదిగా చెబుతారు. ఆలయంలోని శివలింగం, అమ్మవారి విగ్రహాలను అగస్త్య మహర్షి ప్రతిష్టించినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. నంది కొమ్ముల నుంచి వెలుగులు రావడంతో ఈ గ్రామానికి నంది వెలుగు అని పేరు వచ్చినట్లు చరిత్రకారులు, పూర్వీకులు చెప్తున్నారు.