రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరికి మధురపూడి విమానాశ్రయం నందు ఘన స్వాగతం లభించింది. పలుదేశాలలో సీపీఎ కాన్ఫరెన్స్, 68CPC కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా తిరిగి ఆదివారం రాజమండ్రి నగరానికి విచ్చేశారు. దీంతో రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో- ఆర్డినేటర్ వెంకటలక్ష్మి ఆమెకు ఘన స్వాగతం పలికారు.