SKLM: జలుమూరు మండలం టెక్కలిపాడు సచివాలయంలో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు గాను వెల్ నెస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం నేటికి పనులు పూర్తి కాకపోవడంతో దిష్టిబొమ్మల దర్శనమిస్తుంది. దీంతో వైద్య సేవలు అందించేందుకు సరైన వసతి లేకపోవడంతో స్థానిక రైతు భరోసా కేంద్రంలో వైద్య సేవలు అందిస్తున్నామని సిబ్బంది తెలిపారు.