ATP: మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కుందుర్పి మండలం నిజవల్లి గ్రామంలో ఇవాళ రచ్చబండ కార్యక్రమానికి మాజీ ఎంపీ తలారి రంగయ్య హాజరుకానున్నట్లు గ్రామ సర్పంచ్ ప్రభాకర్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలన్నారు.