VSP: ఆర్కేబీచ్లో స్థూపం లాంటి ఈ రాయి వద్ద అందరం ఫొటోలకు ఫోజులిస్తుంటాం. ఇంతకీ ఈ రాయి ఏంటో తెలుసా? ఇది విశాఖపట్నాన్ని, వాల్తేరు గ్రామాన్ని వేరుచేసే సర్వే మార్క్ అని చరిత్రకారులు చెబుతున్నారు. 1847లో బ్రిటీష్ వారు రాసిల్స్ చర్చి నుంచి ఆర్కేబీచ్ వరకు రోడ్డును వేశారు. ఆ సమయంలో 2 గ్రామాలకు సరిహద్దుగా ఈ సర్వే రాయిని వేశారు.