KDP: తన తల్లిదండ్రులు బుల్లెట్ బైక్ కొనివ్వలేదని మనస్థాపానికి గురై జగదీష్(18) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చక్రాయపేట మండలం గండికొవ్వూరు గ్రామం ఓబుళనాయునిపల్లి చెందిన జగదీష్, ఇంటి వద్ద వ్యవసాయం చేస్తుండేవాడు. జీవనోపాధి కోసం కువైట్ వెళ్లిన తల్లిదండ్రులను బైక్ కొనివ్వాలని కోరగా, తండ్రి మందలించడంతో శనివారం రాత్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.