MBNR: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు జాతర ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు నలువైపుల నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయం పరిసరాల్లోని బస్టాండ్, సౌకర్యాల ఏర్పాట్లను ఆయన శనివారం సాయంత్రం పరిశీలించారు.