TPT: చంద్రగిరి జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. పాకాల మండలం ఎర్రేపల్లికు చెందిన నరేష్, తల్లి సంపూర్ణమ్మ (58)తో కలిసి బైక్ పై శ్రీకాళహస్తి వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్ వెనుక కూర్చున్న సంపూర్ణమ్మ చీర చివర భాగం బైక్ వీల్లో చిక్కుకోవడంతో కిందపడిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.