తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తన భర్త అనిల్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 25 నుంచి ప్రారంభించనున్న ‘జాగృతి జనం బాట’ కార్యక్రమం విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. VIP బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్న కవిత దంపతులకు, దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందజేశారు.