కన్నడ బిగ్బాస్లో ఇద్దరు కంటెస్టెంట్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అశ్విని, జాన్వీ.. రక్షిత శెట్టిని కించపరిచేలా మాట్లాడారని ఫైరవుతున్నారు. ‘నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మాకు తెలుసు. నీ డ్రెస్ చూస్తేనే నువ్వు ఎలాంటిదానివో తెలుస్తుంది’ అని అన్నారు. రక్షిత వెనుకబడిన వర్గం నుంచి వచ్చిందని ఇలా మాట్లాడారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.