AP: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ సిడ్నీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో లోకేష్‌కు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. మంత్రి అందరినీ ఆప్యాయంగా పలకరించి వారితో ఫొటోలు దిగారు. తెలుగుదేశం ఆస్ట్రేలియా ప్రతినిధులు, ప్రవాసాంధ్రలు బ్రిస్బేన్, కాన్బెర్రా, అడిలైడ్, మెల్బోర్న్ నుంచి తరలివచ్చారు.