TG: నల్లగొండ(D) చిట్యాల(M) పెద్దకాపర్తిలో విషాదం జరిగింది. వాటర్ ట్యాంక్ కూలి తల్లీకుమారుడు మృతిచెందారు. ఇవాళ హోటల్ ప్రారంభానికి కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. నిన్న రాత్రి అక్కడే బస చేశారు. రేకులపై బరువు ఎక్కువ కావడంతో వాటర్ ట్యాంక్ కూలిపోయింది. ఈ ఘటనలో తల్లి నాగమణి (32), కుమారుడు వంశీకృష్ణ (6) మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.