NLG: నకిరేకల్ పురపాలికలోని 16వ వార్డు కౌన్సిలర్ గర్శకోటి సైదులు జన్మదినం సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం శాలువాతో సత్కరించి, కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మండలంలోని మార్రూర్ గ్రామ మాజీ సర్పంచ్ బలిశెట్టి స్వప్న నూతనంగా కొనుగోలు చేసిన కారును ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు.