MDK: రామాయంపేట మున్సిపాలిటీలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. శుక్రవారం ఇద్దరిపై దాడి చేయగా, శనివారం రాత్రి మూడో వార్డులో ఆడుకుంటున్న బాలుడు సుఫియాన్(6)పై దాడికి పాల్పడ్డాయి. దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సిద్దిపేటకు పంపారు. వరుస దాడులపై రామాయంపేట0 ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.