E.G: ధ్వని కాలుష్య రహిత దీపావళిని జరుపుకోవాలని ధవళేశ్వరం సీఐ టి.గణేశ్ ప్రజలను కోరారు. దవళేశ్వరం బాలికోన్నత పాఠశాల విద్యార్థులతో పోలీస్ స్టేషన్ నుంచి బ్యారేజ్ వరకు పర్యావరణ హితమైన గ్రీన్ క్రాకర్స్ వాడకంపై అవగాహన ర్యాలీ మానవహారం నిర్వహించారు. బాణాసంచా కాల్చేటప్పుడు పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు.