SKLM: దీపావళి కోసం ఇంటికొస్తూ ఓ వ్యక్తి చనిపోయిన విషాద ఘటన ఇది. ఇచ్ఛాపురం(M) లొద్దపుట్టికి చెందిన వసంత్ కుమార్(32) బెల్లుపడ అచ్చమ్మపేటకు చెందిన సంధ్యకు మార్చిలో పెళ్లి జరిగింది. వసంత్ కుమార్ విజయవాడలో పనిచేస్తూ అక్కడే కాపురం పెట్టాడు. స్వగ్రామానికి శనివారం బయల్దేరాడు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద హైవేపై ఆగిఉన్న లారీని ఢీకొట్టారు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.