BDK: మణుగూరు పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం రోడ్డు డివైడర్ మధ్యలో మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని ప్రాణవాయువును ఇచ్చే మొక్కలను నాటి సంరక్షించాలి అన్నారు. రోడ్డు మధ్యలో మొక్కలు నాటడం వల్ల వాహనాల నుంచి వెలువడే కార్బన్‌డయాక్సైడ్‌ను కొంతవరకు నివారించవచ్చు ఎమ్మెల్యే వెల్లడించారు.