WNP: వనపర్తి ఏకో పార్కులో పిల్లల కోసం ప్రత్యేక వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయాలని సందర్శకులు కోరుతున్నారు. పెద్దల పరికరాలు వాడితే జారిపడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. పార్కుకు ఒక వైపు ఫినిషింగ్ లేనందున బయటి వ్యక్తులు వస్తున్నారని, రక్షణ ఏర్పాటు చేయాలన్నారు. పార్కులో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, మంచి మొక్కలు నాటాలని కోరుతున్నారు.