NZB: ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామ చౌకధరల దుకాణం నంబర్ 1893004 వద్ద ఈ నెల 23న బియ్యం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తహశీల్దార్ మల్లయ్య శనివారం తెలిపారు. ఆగస్టు 24న ఆర్మూర్ డిప్యూటీ తహశీల్దార్ సీజ్ చేసిన 4.40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు వేలం వేయనున్నట్లు చెప్పారు. వేలంలో పాల్గొనే వారు రూ.5,000 ధారావతు చెల్లించాలన్నారు.