HYD: మూసీ నదీగర్భాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన శ్రీ ఆదిత్య హోమ్స్‌కు చెందిన ‘వాంటేజ్’ వెంచర్‌పై హైడ్రా దృష్టి సారించింది. నార్సింగి ఎగ్జిట్ సమీపంలోని మంచిరేవులలో ఈసంస్థ దాదాపు 3 ఎకరాల నదీ భూమిని కబ్జా చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇటీవల వచ్చిన వరదలు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును ముంచెత్తడంతో ఈకబ్జా బట్టబయలైంది.