KMR: మద్నూర్ మండలం మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు వద్ద ఉన్న రవాణా శాఖ చెక్ పోస్ట్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం రాత్రి నుంచి రికార్డులను పరిశీలించి లారీల వద్ద నుంచి చెక్ పోస్ట్ అధికారులు, సిబ్బంది అక్రమంగా వసూలు చేసిన రూ. 36 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. ఇంకా తనిఖీలు కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు.