ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ ఓడిపోవడంతో, వన్డే ఫార్మాట్లో వరుసగా 16వ టాస్‌లు ఓడిన జట్టుగా నిలిచింది. గత 2023 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై చివరిసారిగా టీమిండియా టాస్ గెలిచింది. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లలో టాస్ గెలవడంలో వరుసగా విఫలమవుతూనే ఉంది.