HYD: హైడ్రా సిబ్బంది శనివారం ఫతుల్గూడలోని క్రీడామైదానంలో ఫ్లడ్లైట్ల కాంతిలో క్రికెట్ ఆడుతూ సేదతీరారు. అసెట్స్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాల మధ్య జట్ల పోటీ ఉత్సాహంగా సాగింది. కమిషనర్ రంగనాథ్, అదనపు కమిషనర్లు అశోక్ కుమార్, సుదర్శన్, డైరెక్టర్ వర్ణ పాపయ్య పాల్గొన్నారు. క్రీడలు జట్టు స్ఫూర్తిని పెంచుతాయని కమిషనర్ అన్నారు.