HYD: సండే వచ్చిందంటే మాంసం ప్రియులకు ముక్క లేనిదే ముద్ద దిగదు. సండే అంటే మాంసం కోసమే అన్నట్లు కొంతమంది వ్యవహరిస్తుండటం చూస్తుంటాం. ఈరోజు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు స్వల్ప పెరుగుదలతో కొనసాగుతున్నాయి. నగరంలో చికెన్ కిలో ధర రూ.220-రూ.240 మధ్య ఉంది. పండుగల సీజన్, డిమాండ్‌ను బట్టి ప్రాంతాల మధ్య ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది.