JGL: ఉద్యాన అధికారి శ్యాం ప్రసాద్ రైతులు వరి, పత్తి వంటి పంటలతో పాటు అరటి సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. మేడిపల్లి మండలం కట్లకుంటలో శనివారం రైతులకు అరటి సాగుపై అవగాహన కల్పించారు. జిల్లాలో గతంలో 1500 ఎకరాల్లో ఉన్న అరటి సాగు ఇప్పుడు 24 ఎకరాలకు తగ్గిందని తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్నందున రైతులు అరటి సాగును పెంచాలని ఆయన కోరారు.