GNTR: కాజా టోల్గేట్ వద్ద జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొనడంతో శనివారం రాత్రి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్న కారును మరొక కారు వెనుక నుంచి ఢీకొట్టింది. అదే సమయంలో సీఎం కాన్వాయ్ రావడంతో, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు జేసీబీ సహాయంతో వాహనాలను తొలగించి, త్వరగా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.