VKB: జిల్లాలో 59 మద్యం షాపుల టెండర్లకు శనివారం వరకు 1,750 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ విజయ్ భాస్కర్ గౌడ్ తెలిపారు. ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ నెల 23న కలెక్టర్ల సమక్షంలో జరగాల్సిన మద్యం షాపుల డ్రాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 27న డ్రా తీయనున్నట్లు చెప్పారు.