పెర్త్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా వన్డే కెప్టెన్‌గా గిల్‌కు ఇది మొదటి సిరీస్. ఈ మ్యాచ్‌లో స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత బరిలోకి దిగుతున్నారు. దీంతో ‘రో-కో’ ద్వయం ఆటను చూడాలని క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.