ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి వన్డే అరంగేట్రం చేయనున్నాడు. ఈ సందర్భంగా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ నుంచి అతడు వన్డే క్యాప్‌ను అందుకున్నాడు. నితీష్ ఇప్పటికే భారత జట్టు తరఫున టెస్టులు, టీ20లలో ప్రాతినిథ్యం వహించాడు. అటు ఆస్ట్రేలియా నుంచి మాట్ రెన్ షా, మిచ్ ఓవెన్లు ఈ మ్యాచ్‌లోనే తమ అరంగేట్రం చేయబోతున్నారు.