SRPT: గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందగా, మరొక వ్యక్తికి గాయాలైన సంఘటన. కోదాడ పట్టణంలోని 65వ నెంబర్ జాతీయ రహదారి వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కోదాడ మండలం శ్రీరంగాపురం సమీపంలో గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చెపట్టారు.