ADB: జైనథ్ మండలకేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధికారులు తదితరులున్నారు.